: ముంబై వరదల్లో చిక్కుకున్న మాధవన్, అనుపమ్ ఖేర్
బాలీవుడ్ నటులు మాధవన్, అనుపమ్ ఖేర్ లు ముంబై వరదల్లో చిక్కుకుపోయారు. ముంబైని గత మూడు రోజులుగా వర్షాలు ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. ముంబై రోడ్లన్నీ జలమయం కావడంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. ఎక్కడా వాహనాలు కదిలే పరిస్థితి లేకపోవడంతో ఎక్కడి వారక్కడ నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ శాంతాక్రజ్ లో చిక్కుకుపోయారు. దగ్గర్లో ఉన్న స్నేహితుడికి ఫోన్ చేయడంతో, ఆయన తన కుమార్తెతో వచ్చి, ఇంటికి తీసుకెళ్లి ఆతిథ్యం ఇచ్చారని ఆయన చెప్పారు. అలాగే మాధవన్ కారు మోకాలి లోతు నీటిలో వెళ్లడంతో ఇంటికి దగ్గర్లో చెడిపోయింది. దీంతో ఆయన మోకాలి లోతు నీటిలో నడుచుకుంటూ వెళ్లారు. హుమా ఖురేషీ మూడు గంటల పాటు ట్రాఫిక్ లో చిక్కుకుపోయానని తెలిపింది.