: కోహ్లీ మాకు కావాలి...బీసీసీఐ అనుమతి ఇవ్వాలంటున్న పాకిస్థానీ!


పరుగుల యంత్రంగా పేరొందిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తమకు కావాలని పాకిస్థాన్ కు చెందిన ఫవాద్ ఖాన్ డిమాండ్ చేశారు. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) లోని లాహోర్ క్వాలాండర్స్, టీ20 గ్లోబల్ లీగ్ లో డర్బన్ క్వాలాండర్స్ జట్ల యజమాని అయిన ఫవాద్ ఖాన్ మాట్లాడుతూ, విరాట్ కోహ్లీని తన జట్టుకోసం కొనుగోలు చేయాలని ఆశపడుతున్నానని అన్నారు. విదేశీ లీగ్ లలో ఆడేందుకు టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ అనుమతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, కోహ్లీ సారధ్యంలో టీమిండియా విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీలంక టెస్టు సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసే దిశగా సాగుతోంది. 

  • Loading...

More Telugu News