: డోక్లాంపై భారత్ డేగ కన్ను..చైనా తెలివి తేటలు ప్రదర్శిస్తే ముందుకే!


డోక్లాంపై ప్రతిష్టంభన వీడింది. ద్వైపాక్షిక చర్చలతో సమస్య పరిష్కారమైంది. డోక్లాం సరిహద్దుల్లో చైనా రోడ్డు నిర్మాణం విరమించుకుని వెనుదిరగగా, భారత్ తన సైన్యాన్ని తగ్గించింది. అయితే తమ సైన్యం గస్తీ కొనసాగుతుందని చైనా ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత్ ఎలాంటి ప్రకటన చేయకుండా సిక్కిం సరిహద్దుల్లోని డోక్లాం ఔట్‌ పోస్టుల వద్ద భారత జవాన్లను కాపలాఉంచింది. చైనా సైన్యం కదలికలపై డేగ కన్ను వేసేందుకు అనువుగా ఎత్తైన ప్రాంతంలో భారత సైనికులు గస్తీ కాస్తున్నారు.

'ఇది సిక్కిం-భూటాన్‌-టిబెట్‌ ట్రైజంక్షన్‌ లోని డోక్లాంకు 500 మీటర్ల దూరం ఉండడం విశేషం. చైనా నుంచి ఎలాంటి కదలికలు కనిపించినా రంగంలోకి దిగేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉంది. డోక్లాంలో యథాతథ స్థితి కాపాడటమే మన లక్ష్య’మని రక్షణ శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ వివాదం పరిష్కారం కావడంపై గతంలో చైనా, అమెరికాలో భారత రాయబారిగా పనిచేసిన నిరుపమారావు హర్షం వ్యక్తం చేశారు. 

  • Loading...

More Telugu News