: వైవాహిక అత్యాచారం నేరమైతే...భర్తలంతా జైలుకే పరిమితం!: సుష్మా స్వరాజ్ భర్త సంచలన వ్యాఖ్యలు


వైవాహిక అత్యాచారంపై మాజీ గవర్నర్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ భర్త సంచలన వ్యాఖ్యలు చేశారు. వైవాహిక అత్యాచారంపై ఢిల్లీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో వైవాహిక అత్యాచారం ఎక్కడుంది? అని ప్రశ్నించారు. వైవాహిక అత్యాచారం వంటిదేమీ లేదని ఆయన చెప్పారు. ప్రతి పౌరుడి నివాసం జైలు కాకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవేళ వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించడం మొదలు పెడితే భర్తలు ఇళ్లలో ఉండరని, జైళ్లలోనే ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, భార్య అంగీకారం లేకుండా భర్త శృంగారంలో పాల్గొనడాన్ని వైవాహిక అత్యాచారం అంటారు. 

  • Loading...

More Telugu News