: దిలీప్ కు మళ్లీ నిరాశే...భావన లైంగిక వేధింపుల కేసులో మళ్లీ బెయిల్ నిరాకరణ
ప్రముఖ మలయాళ నటి భావన లైంగిక వేధింపుల కేసులో నటుడు దిలీప్ కు హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. తాను అమాయకుడినని, తనను అకారణంగా ఈ కేసులో ఇరికించారని చెబుతూ ఆయన రెండో సారి బెయిల్ కు దరఖాస్తు చేశారు. దీనిని పరిశీలించిన న్యాయస్థానం డిఫెన్స్ వాదనతో ఏకీభవిస్తూ బెయిల్ ను నిరాకరించింది. దిలీప్ మలయాళ సినీ పరిశ్రమలో పలుకుబడి కలిగిన వ్యక్తి అని, ఆయనను బయటకు విడిచిపెడితే కేసు పక్కదోవపట్టే అవకాశం ఉందని డిఫెన్స్ లాయర్ వాదించారు.
జూలై 10న అరెస్టయిన దిలీప్, అలువా సబ్ జైల్ లో రిమాండ్ ఖైదీగా వున్నారు. ఈ సందర్భంగా దిలీప్ కార్యాలయంలో తనిఖీలు కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని దిలీప్ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తూనే ఉన్నాడు.