: భారత్ వరుస విజయాల దెబ్బకు శ్రీలంక లబోదిబో.. సెలక్టర్ల మూకుమ్మడి రాజీనామా!
శ్రీలంక సిరీస్‌లో భాగంగా భారత జట్టు సాధిస్తున్న వరుస విజయాలు శ్రీలంక క్రికెట్‌లో పలు సంచలనాలకు కారణమవుతున్నాయి. టెస్ట్ సిరీస్‌ను 0-3తో ఓడిపోయి, వన్డే సిరీస్‌లో ఇంకా రెండు వన్డేలుండగానే భారత్‌కు అప్పగించేయడం శ్రీలంక క్రికెట్ బోర్డులో భారీ కుదుపునకు కారణమైంది. వరుస ఓటములను తీవ్రంగా పరిగణిస్తున్న లంక సెలక్టర్లు మూకుమ్మడి రాజీనామాకు సిద్ధమయ్యారు. తాజా సిరీస్ ముగియగానే వీరంతా రాజీనామా చేయనున్నారు. చీఫ్ సెలెక్టర్, మాజీ బ్యాటింగ్ దిగ్గజం సనత్ జయసూర్యతోపాటు కమిటీ సభ్యులు మొత్తం కమిటీకి రాజీనామా చేయనున్నారు. సెప్టెంబరు 6న జరగనున్న ఏకైక టీ20 అనంతరం వీరు తమ పదవుల నుంచి తప్పుకోనున్నారు.