: వినియోగదారులకు మరో శుభవార్త చెప్పిన జియో.. ఇంట్లో కూర్చునే ‘కౌన్ బనేడా కరోడ్ పతి’ ఆడేయండి!


సంచలనాలకు మారు పేరు అయిన జియో మరో సంచలనంతో ముందుకొచ్చింది. బిగ్ బీ అమితాబ్ హోస్ట్‌గా వ్యవహరించే ‘కౌన్ బనేగా కరోడ్ పతి-2017’ను ఇంట్లోనే కూర్చుని ఆడే అవకాశాన్ని వినియోగదారులకు కల్పిస్తోంది. టీవీలో షో జరుగుతున్నప్పుడు దానిని చూస్తూ ఆన్‌లైన్‌లో ఆడాల్సి ఉంటుంది. అక్కడ హాట్‌ సీట్ మీద కూర్చున్న కంటెస్టెంట్ కంటే ముందే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇందుకోసం తొలుత జియో చాట్‌ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.  ఆ తర్వాత కేబీసీలోకి లాగిన్ అయి ఎంచక్కా ఆడేసుకోవడమే.

గేమ్ ఆడే సమయంలో కనిపించే నాలుగు ఆప్షన్ల నుంచి సరైన సమాధానాన్ని ఎంచుకుని హాట్‌ సీట్‌లో ఉన్న వ్యక్తి కంటే ముందే పంపాల్సి ఉంటుంది. సమాధానం సరైనదైతే కంటెస్టెంట్‌తోపాటు రెండో ప్రశ్నకు వెళ్లిపోతారు. తప్పుగా చెబితే మాత్రం అక్కడే ఆగిపోతారు. కావాలనుకుంటే మళ్లీ వేరే వాళ్లతో మొదలయ్యే రౌండ్ నుంచి మళ్లీ ఆడుకోవచ్చు. చెప్పిన సమాధానాలను బట్టి అమితాబ్ బచ్చన్ ఆ తర్వాతి రోజు విజేతలను ప్రకటిస్తారు. ఇందుకోసం కేబీసీతో జియో ఒప్పందం కుదుర్చుకుంది. ‘ఘర్ బేటీ జీతో’ పేరుతో వస్తున్న ఈ ప్రత్యేక సదుపాయం జియో వినియోగదారులకు మాత్రమే. ఒకవేళ జియో వినియోగదారులు కానివారు ఆడాలనుకుంటే జియో చాట్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ విషయంలో మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఎంపిక చేసిన విజేతలకు డాట్సన్ రెడిగో కారును బహుమతిగా అందిస్తారు.

  • Loading...

More Telugu News