: తను చేసిన ఛాలెంజ్ కు శిల్పా మోహన్ రెడ్డి ఇప్పుడు సమాధానం చెప్పాలి!: మంత్రి అఖిలప్రియ


నంద్యాల ఉపఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంపై మంత్రి అఖిలప్రియ మరోమారు హర్షం వ్యక్తం చేశారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ‘నంద్యాల ఉపఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి అని తెలియగానే, టీడీపీకే ఓటు వేయాలని అప్పుడే ప్రజలు నిర్ణయించుకున్నారు. ఇంత మెజార్టీతో టీడీపీ విజయం సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. పోలింగ్ శాతం పెరిగితే టీడీపీకి మంచి మెజార్టీ వస్తుందని అనుకున్నాం..అదే జరిగింది. ఈ ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటామన్నవారు సమాధానం చెప్పాలి. ఆ బాధ్యత వైసీపీ నేతలపై ఉంది. శిల్పా మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి ఆయన చేసిన ఛాలెంజ్ కు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాము. సవాల్ చేయడమనేది ప్రతి వాళ్లకి ఫ్యాషన్ అయిపోయింది’ అని విమర్శించారు.

  • Loading...

More Telugu News