: మోటో నుంచి భారత మార్కెట్లోకి మరో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ మోటో నుంచి భారత మార్కెట్లోకి మోటో జీ5ఎస్, మోటో జీ5ఎస్ ప్లస్ పేర్లతో మరో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు విడుదలయ్యాయి. మోటో జీ5ఎస్ ధర రూ.13,999 కాగా, మోటో జీ5ఎస్ ప్లస్ ధర రూ.15,999గా ఉంది. ఈ రెండు స్మార్ట్ఫోన్ల బ్యాటరీ సామర్థ్యం 3000 ఎంఏహెచ్.
ఇక మోటో జీ5ఎస్ ప్లస్ లో.. 5.5 అంగుళాల డిస్ప్లే, ఆండ్రాయిడ్ నోగట్ ఆపరేటింగ్ సిస్టమ్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 13 మెగాపిక్సెల్‌తో రెండు వెనుక కెమెరాలు, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఫీచర్లుగా ఉన్నాయి. మోటో జీ5ఎస్ లో.. 5.2 అంగుళాల డిస్ప్లే, ఆండ్రాయిడ్ నోగట్ ఆపరేటింగ్ సిస్టమ్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 16 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి.