: ఉత్త‌ర‌ కొరియాకు చెక్ పెట్టేందుకు సిద్ధం: అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన


త‌న తీరు మార్చుకోని ఉత్త‌ర‌కొరియా మ‌రోసారి న్యూక్లియర్ మిస్సైల్ టెస్ట్‌ లు నిర్వహించిన విష‌యంపై ఇప్ప‌టికే రష్యా, జపాన్‌, ద‌క్షిణ కొరియా, చైనా ఆందోళన వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్త‌ర‌కొరియా విష‌యంపై మాట్లాడుతూ... ఇటువంటి తీవ్ర‌ చ‌ర్య‌లు ఉత్తర కొరియాను ప్రపంచ దేశాల ముందు ఏకాకిని చేస్తాయని అన్నారు. ఉత్తర కొరియా దూకుడుకు చెక్ పెట్టేందుకు అన్ని రకాలుగా సిద్ధ‌మ‌ని పేర్కొన్నారు. ఆ దేశం పంపుతున్న‌ సంకేతాలను ప్రపంచం గమనిస్తోంద‌ని అన్నారు. ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ సమాజాన్ని ధిక్కరించేలా ఉత్త‌ర‌కొరియా చ‌ర్య‌లు ఉన్నాయ‌ని వ్యాఖ్యానించారు. కాగా, జ‌పాన్‌ ప్రధాని షింజో అబేతో డొనాల్డ్‌ ట్రంప్ ఈ రోజు మాట్లాడారు. ఉత్తర కొరియా చర్య‌లు ప్రపంచానికి ప్ర‌మాద‌క‌ర‌మని ఇరు దేశాల అగ్ర‌నేత‌లు అభిప్రాయపడినట్టు శ్వేత‌సౌధం తెలిపింది.

  • Loading...

More Telugu News