: చంద్రబాబును కలిసిన భూమా అఖిలప్రియ, బ్రహ్మానందరెడ్డి


నంద్యాలలో ఘన విజయం సాధించిన భూమా బ్రహ్మానందరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి భూమా అఖిలప్రియకు, బ్రహ్మానందరెడ్డికి చంద్రబాబు అభినందనలు తెలిపారు. అనంతరం, విజయోత్సవ కేక్ ను చంద్రబాబు కట్ చేశారు. బ్రహ్మానందరెడ్డికి కేక్ ముక్క తినిపించి, పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు. ఈ సందర్భంగా భూమా బ్రహ్మానందరెడ్డిని పలువురు టీడీపీ నేతలు అభినందించారు.

  • Loading...

More Telugu News