: గుర్మీత్ బాబా ఆశ్రమంలో 18 మంది అమ్మాయిలను రక్షించిన పోలీసులు
అత్యాచార కేసులో డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్ సింగ్‌కు సీబీఐ కోర్టు శిక్షను ఖరారు చేసిన నేపథ్యంలో హర్యానాలోని సిర్సాలో డేరా ఆశ్రమంలో పోలీసులు సోదాలు చేశారు. ఈ క్రమంలో అందులో ఉన్న 18 మంది బాలికలను పోలీసులు రక్షించి, వారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తాము రక్షించిన అమ్మాయిలందరూ 18 ఏళ్ల వయసు ఉన్నవారేనని పోలీసులు చెప్పారు. ప్రస్తుతం వారిని బాలల సంరక్షణ కేంద్రాలకు తరలించామని అన్నారు. బాబా పేరుతో గుర్మీత్ సింగ్ చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.