: మహారాష్ట్రలో ఘోరం.. తినడానికి ఏమీలేదని తల్లి గుండెను చీల్చి తినేసిన కొడుకు!
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కి చెందిన సునీల్ అనే 27 ఏళ్ల యువకుడు దారుణ ఘటనకు పాల్పడ్డాడు. దినసరి కూలీగా పనిచేస్తూ జీవితం గడుపుతున్న ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. సునీల్ పచ్చి తాగుబోతు కావడంతో ఆయన భార్య తన పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. తన తల్లితో పాటు ఉంటున్న సునీల్ బాగా తాగి వచ్చి తనకు ఇంట్లో తినడానికి ఏమీ లేదని తల్లితో గొడవపడ్డాడు.
ఈ క్రమంలో ఆగ్రహంతో రెచ్చిపోయిన సునీల్ తన తల్లిని పొడిచి చంపేసి, ఆమె గుండెను చీల్చి దానిపై కారం చల్లాడు. ఇంట్లో ఉన్న చట్నీలో దాన్ని ముంచి తిని రాక్షసుడిలా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అతడని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.