: ‘అర్జున్ రెడ్డి’ని చూసిన వాళ్లు ఎవరైనా ఇంకా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ గా ఉంటారా?: రామ్ గోపాల్ వర్మ


‘అర్జున్ రెడ్డి’ సినిమా చూసిన తర్వాత  హీరో విజయ్ దేవరకొండ కంటే హీరో పవన్ కల్యాణ్ కు ఫ్యాన్స్ గా ఉంటారా? అంటూ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోమారు తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు వర్మ తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా చేసిన ఓ ట్వీట్ లో ఈ విషయాన్ని ప్రస్తావించారు.

 ‘తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఏ వ్యక్తి అయినా ‘అర్జున్ రెడ్డి’ సినిమా చూసిన తర్వాత విజయ్ దేవరకొండకు కాకుండా పవన్ కల్యాణ్  ఫ్యాన్స్ గా ఉంటారా! అలా ఎవరైనా ఉంటే, వారు తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం, మోసం చేసినవాళ్లు అవుతారే తప్పా, మరేమీ కారు. బ్రిటిష్ హయాంలో మన దేశానికి చెందిన నమ్మకద్రోహులు ఎలాంటి వారో.. వీళ్లు కూడా అంతే అని నా నమ్మకం’ అని వర్మ తన పోస్ట్ లో ఘాటు వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News