: తెలంగాణలో ప్రాంతాల మధ్య ముఖ్యమంత్రి చిచ్చుపెడుతున్నారు!: కేసీఆర్ పై ధ్వజమెత్తిన డీకే అరుణ
తెలంగాణలో ప్రాంతాల మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్ చిచ్చుపెడుతున్నారంటూ మాజీ మంత్రి డీకే అరుణ ఆరోపించారు. తెలంగాణ సెంటిమెంట్ తో రాజకీయంగా పబ్బం గడుపుకునేందుకు ఇలాంటి మతిలేని చేష్టలకు కేసీఆర్ దిగుతున్నారని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టులపై టీఆర్ఎస్ నేతలు ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతున్నారని... వివిధ ప్రాంతాల ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మహబూబ్ నగర్ నుంచి నల్గొండకు నీళ్లు ఇవ్వకూడదని ఎవరూ అనలేదని చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో విపక్షాలు చేపట్టిన మహాధర్నాలో అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.