: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు!


ఈ రోజు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 362.43 పాయింట్లు నష్టపోయి, 31,388.39 పాయింట్ల వద్ద, ఎన్ ఎస్ఈ నిఫ్టీ 116.75 పాయింట్ల నష్టంతో 9,800 పాయింట్ల దిగువకు ముగిశాయి. టెక్ మహీంద్రా, జీ ఎంటర్ టైన్ , విప్రో, ఎం.అండ్.ఎం తదితర షేర్లు లాభపడ్డాయి. హిందాల్కో, ఐడియా సెల్యులార్, ఎన్టీపీసీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, టాటా పవర్ మొదలైన షేర్లు నష్టపోయాయి. కాగా, మదుపరులు లాభాల స్వీకరణకు మెుగ్గుచూపడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకోగా, జపాన్ మీదుగా ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం చేయడం అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం చూపింది.

  • Loading...

More Telugu News