: 'జూలి 2'గా రాయ్ లక్ష్మి గ్లామర్ తో మతిపోగొట్టేస్తోంది!
వెండితెరపై భారీ అందాల భామలుగా క్రేజ్ తెచ్చుకున్న కథానాయికలలో రాయ్ లక్ష్మి ఒకరు. తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ సినిమాలు చేస్తూ గ్లామర్ పరంగా రాయ్ లక్ష్మి మంచి మార్కులు కొట్టేసింది. కొంచెం ఆలస్యంగానే బాలీవుడ్ దృష్టిలో పడిన ఈ భామ .. 'జూలి 2' సినిమా చేసింది. గతంలో వచ్చిన 'జూలి'కి సీక్వెల్ గా దర్శక నిర్మాత శివదాసాని ఈ సినిమాను తెరకెక్కించాడు.
రాయ్ లక్ష్మి' ప్రధాన పాత్రగా ఈ సినిమా రూపొందింది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను వదిలారు. రాయ్ లక్ష్మి అందాల పైనే ఫోకస్ చేస్తూ కట్ చేసిన ఈ టీజర్ యూత్ ను ఆకట్టుకునేలా వుంది. ఈ సినిమాలో రాయ్ లక్ష్మి ఏ రేంజ్ లో అందాలను ఆరబోసిందనేది టీజర్ తోనే తెలిసిపోతోంది. ఈ సినిమా తరువాత బాలీవుడ్ నుంచి భారీ ఛాన్సులు వస్తాయని ఆమె పెట్టుకున్న ఆశలు ఫలిస్తాయనే అనిపిస్తోంది.