: భారత ప్రేక్షకులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శ్రీలంక మాజీ కెప్టెన్ రణతుంగ


శ్రీలంక క్రికెట్ మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. భారత్ తో జరిగిన మూడో వన్డేలో శ్రీలంక ఓటమి అంచుల్లో ఉన్న సమయంలో... శ్రీలంక అభిమానులు గ్రౌండ్ లోకి వాటర్ బాటిళ్లను విసిరిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా మ్యాచ్ కు 35 నిమిషాల పాటు అంతరాయం ఏర్పడింది.

 దీనిపై రణతుంగ స్పందిస్తూ, లంక అభిమానులు ఓర్పుతో వ్యవహరించాలని కోరారు. క్రికెట్ కోసం ఆటగాళ్లు ఎంతో కోల్పోతారని... వరుస ఓటములకు లోనైనప్పుడు ఆటగాళ్లు ఎంతో ఒత్తిడికి గురవుతారని చెప్పారు. భారత ప్రేక్షకుల్లా శ్రీలంక అభిమానులు ప్రవర్తించరాదని కోరుతున్నానని చెప్పాడు. ఇలాంటి ప్రవర్తనను తమ సంస్కృతి ఒప్పుకోదని అన్నాడు. భారత క్రికెట్ అభిమానులను ఉద్దేశిస్తూ రణతుంగ చేసిన కామెంట్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయనపై భారత నెటిజన్లు మండిపడుతున్నారు.

  • Loading...

More Telugu News