: రాజకీయాల్లో నాకు తోడుగా అన్న వచ్చారు: భూమా అఖిలప్రియ
రాజకీయాల్లో తనకు తోడుగా తన అన్న వచ్చారని ఏపీ మంత్రి అఖిలప్రియ అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, అమ్మానాన్న లేని తమను ప్రజలు ఆదరించారని, తన అన్న భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపు సీమ రాజకీయాల్లో మార్పు తెస్తుందని చెప్పారు. నంద్యాల విజయంలో యువత, మహిళలదే కీలకపాత్ర అని, ప్రజలు తమను నమ్మారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయమని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
చంద్రబాబు చేపట్టిన అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తోందని, బాబు ఆశయాలను ముందుకు తీసుకెళతామని చెప్పారు. సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు, తన డ్రెస్ కోడ్ పై రోజా చేసిన వ్యాఖ్యలు ప్రజలను ఆలోచింపజేశాయని అన్నారు. తన చుడీదార్ పై రోజా చేసిన కామెంట్స్ ఆమెకే రివర్స్ కొట్టాయని, ఎనభై శాతం మహిళలు చుడీదార్లే వేసుకుంటున్న విషయాన్ని రోజా గుర్తించాలని అఖిలప్రియ అన్నారు.