: ‘అర్జున్ రెడ్డి’ సినిమాను ఆకాశానికెత్తేసిన దర్శకధీరుడు రాజమౌళి
విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు సందీప్ రెడ్డి తెరకెక్కించిన అర్జున్ రెడ్డి సినిమాపై టాలీవుడ్ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా దర్శకుడు రాజమౌళి తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ సినిమాపై స్పందిస్తూ... తాను ఈ రోజు అర్జున్ రెడ్డి సినిమాను చూశానని చెప్పారు. విజయ్ దేవర కొండ నటన అద్భుతమని, ఆయన నటనలో జీవించాడని పేర్కొన్నారు. హీరోయిన్ షాలినితో పాటు ఈ సినిమాలో నటించిన ఇతరులు కూడా చాలా నేచురల్‌గా నటించారని కొనియాడారు. బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించినందుకు ఈ సినిమా టీమ్‌కి అభినందనలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సినిమాలోని డైలాగులు అద్భుతంగా ఉన్నాయని, ఈ సినిమాను డైరెక్టర్ సందీప్ రెడ్డి అద్భుతంగా తెరకెక్కించారని అన్నారు.