: విజయ్ దేవరకొండ బంధువు అయినందునే... సినిమా బాగుందని కేటీఆర్ అన్నారు!: వీహెచ్ మండిపాటు


విజయ్ దేవరకొండ నటించిన సినిమా 'అర్జున్ రెడ్డి'పై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు కోపం ఇంకా చల్లారలేదు. ఈ సినిమాను చూసి, చాలా బాగుందని చెప్పిన మంత్రి కేటీఆర్ పై కూడా వీహెచ్ మండిపడ్డారు. ఇలాంటి అసభ్యకరమైన సినిమాను చూసిన కేటీఆర్... ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారని ధ్వజమెత్తారు.

కేటీఆర్ కు హీరో విజయ్ దేవరకొండ బంధువవుతాడని... అందుకే సినిమా బాగుందని కేటీఆర్ అన్నారని మండిపడ్డారు. ఈ సినిమాలో హీరో డ్రగ్స్ తీసుకునే సన్నివేశాలు ఉన్నాయని... ఈ సినిమాను చూసి యువత పాడవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లి  కాకుండానే అమ్మాయిని తల్లిని చేసే సన్నివేశాలు ఉన్నాయని... మందు తాగి పేషెంట్లకు వైద్యం చేశానని హీరో గొప్పగా చెప్పుకునే సన్నివేశం ఉందని చెప్పారు. వైద్యులపై కూడా ఈ సినిమా ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ సినిమా ప్రదర్శనను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News