: చైర్మన్ పదవికి రాజీనామా చేసిన విశాల్ సిక్కా భార్య వందన!


ఇన్ఫోసిస్ ఫౌండేషన్, యూఎస్ఏ కు చైర్మన్ గా వ్యవహరిస్తున్న వందనా సిక్కా తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా విషయాన్ని ఈ మెయిల్ ద్వారా కంపెనీకి తెలిపారు. ఈ విషయాన్ని తన బ్లాగ్, ట్విట్టర్ ఖాతాల ద్వారా వందన పేర్కొన్నారు. కాగా, రెండున్నరేళ్లుగా ఆమె ‘ఇన్ఫోసిస్’, యూఎస్ఏ కు చైర్మన్ గా వ్యవహరించారు. కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ చేసిన వందన, ‘ఇన్ఫోసిస్’లో చేరకముందు ఒక స్టార్టప్ కంపెనీని ప్రారంభించాలని అనుకున్నారు. ఇదిలా ఉండగా, ‘ఇన్ఫోసిస్’ మాజీ సీఎండీ విశాల్ సిక్కా భార్య వందన. విశాల్ సిక్కా తన పదవికి రాజీనామా చేయడంతో ఆయన భార్య కూడా తన పదవికి గుడ్ బై చెప్పారు.

  • Loading...

More Telugu News