: వచ్చే ఎన్నికల్లో రోజాపై పోటీ చేస్తా!: నటి వాణివిశ్వనాథ్ ప్రకటన
ప్రముఖ సినీ నటి వాణివిశ్వనాథ్ రాజకీయ ఆరంగేట్రం చేస్తున్నారు. తెలుగు సినీ ప్రేక్షకులు తనను ఎంతగానో ఆదరించారని, వారి రుణం తీర్చుకునేందుకు తాను రాజకీయాల్లోకి వస్తున్నానని ఆమె ఓ టీవీ ఛానల్ కు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే తనకు చాలా ఇష్టమని... రాజకీయాల్లో ఆయన ఓ రోల్ మోడల్ అని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి టికెట్ వస్తే, చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే రోజాపై పోటీ చేస్తానని చెప్పారు.