: వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన ఎస్ఐపై చర్య.. ఎన్నికల విధుల నుంచి తొలగింపు!


కాకినాడలో జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ-టీడీపీ, వైసీపీ-బీజేపీ శ్రేణుల మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. కొన్ని చోట్ల వైసీపీ నేతలు ఓటర్లకు డబ్బులు పంచారంటూ బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు పట్టించుకోకపోవడతో...  వైసీపీకి అనుకూలంగా ఎస్ఐ వ్యవహరిస్తున్నారంటూ పోలీసు ఉన్నతాధికారులు, ఎన్నికల అధికారులకు కాకినాడ టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో, ఎస్ఐను ఎన్నికల విధుల నుంచి తొలగించారు. 38వ డివిజన్ లో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారన్న కారణంతో ఆయనపై వేటు వేశారు. 

  • Loading...

More Telugu News