: గుర్మీత్ సింగ్ అనుచరుల అల్లర్ల కారణంగా షూటింగ్ కేన్సిల్ చేసుకున్న బాలీవుడ్ భామ!


డేరా బాబా అనుచరుల అల్లర్లలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ అలియా భట్ ఇరుక్కుపోయింది. అలియా భట్ ప్రధాన పాత్రలో రాజీ అనే సినిమాను మేఘనా గుల్జార్ రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో అలియా భట్ సరసన విక్కీ కౌశల్ నటిస్తున్నాడు. కాగా, హరీందర్ సిక్కా రాసిన నవల 'సెహ్మత్' ఆధారంగా ఈ 'రాజీ' చిత్రం తెరకెక్కుతోంది. ఈ నేపథ్యంలో నేటివిటీ కోసం ఈ సిినిమా షూటింగ్ షెడ్యూల్ పంజాబ్ లోని పటియాలాలో పెట్టుకున్నారు.

సెప్టెంబర్ పది వరకు ఈ షెడ్యూల్ జరగాల్సి ఉంది. అయితే గత 25న డేరా బాబా గుర్మీత్ రాం రహీం సింగ్ కు అత్యాచారం కేసులో శిక్ష పడింది. ఆ సమయంలో ఈ చిత్రయూనిట్ షూటింగ్ లో ఉంది. అప్పటికే పోలీసుల హెచ్చరికలు, మీడియాలో వార్తలు చూడడంతో చిత్ర యూనిట్ షూటింగ్ రద్దు చేసుకుంది. అల్లర్లలో షూటింగ్ పరికరాలను పాడు చేసే అవకాశం ఉండడంతో షెడ్యూల్ ను ఆపేశారు. దీంతో అలియా భట్ హోటల్ రూమ్ కే పరిమితమైంది. బయటకు వచ్చేందుకు కూడా సాహసం చేయడం లేదు. 

  • Loading...

More Telugu News