: 'రాక్ స్టార్ బాబా' గుర్మీత్ కి సోమవారం రాత్రి ఎలా గడిచిందంటే..!


లక్షలాది మందికి అతను దైవాంశ సంభూతుడు. భారీ సెక్యూరిటీ, ఫ్యాన్సీ కార్లు, రంగురంగుల దుస్తులు, చుట్టూ సేవలు చేసేందుకు అందమైన అమ్మాయిలు... వారం క్రితం వరకూ డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ గడిపిన విలాసవంత జీవితమిది. తన వద్ద శిష్యురాళ్లుగా ఉన్న ఇద్దరిపై ఆయన అత్యాచారం చేశాడన్న ఆరోపణలు రుజువు కావడంతో సోమవారం నాడు గుర్మీత్ కు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడ్డ సంగతి తెలిసిందే. ఆపై జైల్లో ఖైదీగా ఆయన తొలి రాత్రిని నిన్న గడిపారు. సోమవారం రాత్రి ఆయన నిద్రలేని రాత్రిని గడిపారని, తెల్లవారుజామున ఎప్పుడో ఆయన కాసేపు నిద్ర పోయారని జైలు వర్గాలు తెలిపాయి.

ఆయనకు సాధారణ ఖైదీలకు ఇచ్చినట్టే రెండు బెడ్ షీట్లు, ఓ ప్లేటు, గ్లాసు ఇచ్చామని, ఆయనతో పాటు జైలుకు తెచ్చుకున్న ఎరుపు రంగు సూట్ కేసును వెనక్కు పంపించామని తెలిపారు. రెండు జతల దుస్తులను కూడా అందించామని అన్నారు. తాను కొంచెం అసౌకర్యంతో ఉన్నట్టు గుర్మీత్ తెలిపాడని, బయటి మందులుకానీ, ఆహారం కానీ ఆయనకు అందలేదని తెలిపారు. ఈ ఉదయం మిగతా ఖైదీలకు ఇచ్చిన ఆహారాన్నే అందించామన్నారు. కాగా, సాధారణ ఖైదీగా గుర్మీత్ వారానికి ఒకసారి ఒకరితో ములాఖత్ కావచ్చని చెప్పారు. ఆయన ఆరోగ్యం, నైపుణ్యాలను పరిశీలించిన తరువాత నిబంధనల మేరకు ఓ పని కేటాయిస్తామని, అందుకు రోజువారీ కూలీ కూడా ఉంటుందని అన్నారు.

  • Loading...

More Telugu News