: నందమూరి బాలకృష్ణ.. 43 ఇయర్స్ ఇండస్ట్రీ!


నటసింహ నందమూరి బాలకృష్ణ తన సినీ కెరియర్లో 43 సంవత్సరాలను పూర్తి చేసుకున్నారు. 1974లో బాల నటుడిగా బాలయ్య సినీ రంగ ప్రవేశం చేశారు. తన తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన 'తాతమ్మ కల' సినిమాతో సినీ అరంగేట్రం చేశారు. అనంతరం పలు చిత్రాల్లో నటించిన బాలయ్య... 16 ఏళ్ల వయసులో 'అన్నదమ్ముల అనుబంధం' సినిమాలో పూర్తి స్థాయి క్యారెక్టర్ లో నటించారు. అక్కడ నుంచి ఆయన వెనక్కి తిరిగి చూడలేదు.

'గౌతమీపుత్ర శాతకర్ణి' లాంటి సూపర్ హిట్ సినిమాతో 100వ చిత్రాన్ని పూర్తి చేసుకున్నా... ఆయనకు నటనపై ఇంకా మమకారం పోలేదు. 'పైసా వసూల్' అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇంతలోనే మరో సినిమాను కూడా మొదలెట్టేశారు. తన కెరియర్లో ఎన్నో ఘన విజయాలను సాధించిన బాలయ్య... ఉత్తమ నటుడిగా రెండు నంది అవార్డులను సొంతం చేసుకున్నారు. నాలుగు సంతోషం అవార్డులు, మూడు టీఎస్సార్ అవార్డులు, ఒక సైమా అవార్డు, ఒక సిని'మా' అవార్డును సాధించారు. తాను నటించిన తొలి చిత్రం 'తాతమ్మ కల'కు ఉత్తమ బాలనటుడిగా అవార్డును అందుకున్నారు. మూడు సార్లు ఫిలింఫేర్ కు నామినేట్ అయ్యారు. 

  • Loading...

More Telugu News