: జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న తొలి సీజేగా దీపక్ మిశ్రా!
ఇండియాలో జెడ్ క్యాటగిరీ భద్రతతో, నిత్యమూ బుల్లెట్ ప్రూఫ్ కారు, సెక్యూరిటీతో సుప్రీంకోర్టుకు వచ్చే న్యాయమూర్తి దీపక్ మిశ్రా, ఈ స్థాయిలో సెక్యూరిటీ ఉన్న తొలి చీఫ్ జస్టిస్ గానూ నిలిచారు. నిన్న భారత ప్రధాన న్యాయమూర్తిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ముంబై బాంబు పేలుళ్ల కేసు వంటి అత్యంత సమస్యాత్మక కేసులో దోషి యాకబ్ మెమన్ కు ఉరిశిక్ష ఖరారు అయిన తరువాత, జూలై 30, 2015న అతని చివరి క్షమాభిక్షను తిరస్కరించిన సుప్రీంకోర్టు బెంచ్ కి నేతృత్వం వహించింది దీపక్ మిశ్రానే!
ఆపై ఆయన్ను హత్య చేస్తామని బెదిరింపులు రావడంతో అప్పటి నుంచి ఆయనకు జెడ్ క్యాటగిరీ భద్రతను కల్పించారు. అప్పటి నుంచి పూర్తి స్థాయి సెక్యూరిటీతో కోర్టుకు వస్తున్న న్యాయమూర్తిగా ఆయన నిలిచారు. ఆయన ప్రస్తుతం కావేరీ, కృష్ణా జలాల వివాదం, బీసీసీఐలో సంస్కరణలు, సహారా వంటి కీలక కేసుల వాదనలను వింటున్నారు.