: సూర్యుడి వైపు చూడకు, మాడి మసైపోతావు!: కత్తి మహేశ్ కు బండ్ల గణేష్ హెచ్చరిక


సినీ విశ్లేషకుడు కత్తి మహేష్, పవన్ కల్యాణ్ ను విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలపై నిర్మాత, నటుడు బండ్ల గణేష్ మండిపడ్డాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, " తమ్ముడూ, కత్తి మహేష్! సూర్యుడి వైపు చూడకు... ఆ సూర్య కిరణాలమైన మా లాంటి వారిచే మాడి మసైపోతావు" అని హెచ్చరించాడు. ఆపై పవన్ అభిమానులు కత్తి మహేష్ ను తిడుతూ పెట్టిన ట్వీట్లను రీట్వీట్ చేశాడు.

"నీతి, నిజాయితీ గురించి చెప్పించుకునే అవకాశం  పవర్ స్టార్ కు రాదు, లేదు" అని ఓ ట్వీట్ ను, "సూర్యుడి గురించి, ఆయన శక్తి గురించి ఆలోచించే అంత బుర్ర లేదులే. అందుకే అర్హతకి మించి మాట్లాడుతున్నాడు" అన్న మరో ట్వీట్ ను షేర్ చేశాడు.

  • Loading...

More Telugu News