: కిమ్ వదిలిన క్షిపణి దెబ్బ... పెరిగిన బంగారం ధర!


మరో ఖండాంతర క్షిపణిని ఉత్తర కొరియా పరీక్షించగా, మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో, తమ పెట్టుబడులకు బులియన్ మార్కెట్ క్షేమమని భావిస్తున్న ఇన్వెస్టర్లు, ఒక్కసారిగా బంగారం కొనుగోలుకు ముందుకు రావడంతో ధరలు పెరిగాయి. మంగళవారం నాటి ఎంసీఎక్స్ సెషన్ లో పది గ్రాముల బంగారం ధర రూ. 108 పెరిగి రూ. 29,275కు చేరగా, కిలో వెండి ధర రూ. 124 పెరిగి రూ. 39,851 (సెప్టెంబర్ డెలివరీ)కి చేరుకుంది.

 అటు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర అర శాతం పెరిగి 1,316.66 డాలర్లకు చేరింది. గత సంవత్సరం నవంబర్ లో 1,322 డాలర్లను తాకిన తరువాత బంగారం ధరలు దిగిరాగా, ఆ తరువాత అదే స్థాయికి దగ్గర కావడం ఇదే తొలిసారి. సోమవారం నాటి సెషన్లో సైతం ఔన్సు బంగారం ధర 1.4 శాతం పెరిగింది. ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు ఉద్రిక్తతలను పెంచగా, ఫ్యూచర్స్, స్పాట్ మార్కెట్లలో పలు కంపెనీల ఈక్విటీలు నష్టాలను చవిచూస్తున్నాయి. జపాన్ ఎన్ విలువ మాత్రం గణనీయంగా పెరిగి నాలుగు నెలల గరిష్ఠానికి చేరింది.

  • Loading...

More Telugu News