: మా మీదకి వస్తే సముద్రంలో కలిపేస్తాం...అమెరికా, దక్షిణ కొరియాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఉత్తరకొరియా


అమెరికా, దక్షిణ కొరియాలకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తున్న ఉత్తరకొరియా అధ్యక్షుడు ఈ సారి మరింత గట్టి హెచ్చరికలు చేశాడు. ఆ దేశానికి చెందిన అధికార పత్రిక రొడాంగ్ సిన్మన్ నావికాదళ 68వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తరకొరియా.. అమెరికా, దక్షిణ కొరియాలకు సూటిగా హెచ్చరికలు చేసింది.

‘‘మా దేశంపైకి దండెత్తి వస్తే అమెరికా మొత్తాన్ని సముద్రంలో కలిపేసేందుకు సిద్ధంగా ఉన్నాం. విధ్వంసపు కత్తితో పొడవాలని చూస్తున్న దక్షిణ కొరియాను, దాని వెనకున్న అమెరికాను ఎప్పుడైనా ఎదుర్కొనేందుకు తగిన సామర్థ్యాన్ని సాధించాం. అమెరికా యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తే ఉత్తర కొరియా నావికాదళం సత్తా చాటుతుంది’’ అంటూ హెచ్చరికలు జారీ చేసింది. 

  • Loading...

More Telugu News