: అభిరుచి మధు కారును మరోసారి ధ్వంసం చేసిన దుండగులు.. నంద్యాలలో కలకలం!
నంద్యాల టీడీపీ నేత అభిరుచి మధు ఇంటి వద్ద ఉన్న కారును గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. వారి దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. జరిగిన ఘటనపై పోలీస్ స్టేషన్ లో మధు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. మరోవైపు, నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ తర్వాత రోజు కూడా మధు, శిల్పా చక్రపాణిరెడ్డిల మధ్య వివాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో మధు కారుపై శిల్పా అనుచరులు రాళ్లు రువ్వడంతో, ఆయన కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ కేసుకు సంబంధించి వైసీపీకి చెందిన పలువురిపై కేసులు కూడా నమోదయ్యాయి.