: సమంతే దెయ్యం, నేను 'మెంటలిస్ట్'ని!: 'రాజుగారి గది 2'పై నాగ్ ఆసక్తికర కబుర్లు


త్వరలో విడుదలకానున్న 'రాజుగారి గది-2'లో సమంత దెయ్యంగా నటించిందని, ఆమె ఆత్మగానూ కనిపిస్తుందని హీరో నాగార్జున తెలిపారు. తాను అబ్జర్వేషన్ పవర్స్, మిర్రర్ మెమరీ ఉండే 'మెంటలిస్ట్' పాత్రను చేశానని చెప్పారు. తన జీవితంలో నిజమైన మెంటలిస్టులను కూడా కలిశానని, వారికి 20 ఏళ్ల నాడు జరిగిన అంశాలు కూడా ఎంతో బాగా గుర్తుంటాయని చెప్పుకొచ్చారు.

మలయాళంలో హిట్టయిన 'ప్రేతమ్' స్ఫూర్తిగా సినిమా తీసినప్పటికీ, మక్కీకి మక్కీ కాపీ కొట్టలేదని వెల్లడించిన నాగ్, తనకు, సమంతకూ మధ్య సాగే డ్రామా అద్భుతంగా వచ్చిందని చెప్పారు. దేవుడు ఉన్నాడంటే... దెయ్యం కూడా ఉన్నట్టేనన్నది తన అభిప్రాయమని, చిన్నప్పుడు ఏవో శబ్దాలు విని నిద్రపట్టకపోతే, దెయ్యాలు వచ్చాయని అంటుండేవారమని అన్నారు. రాజుగారి గదిలో నటించడం తనకు కొత్తగా అనిపించిందని, దర్శకుడు ఓంకార్, తాను అనుకున్నది అనుకున్నట్టు తీశాడని కితాబిచ్చారు. ఈ చిత్రంలో తన కామెడీ తక్కువేనని, వెన్నెల కిశోర్, ప్రవీణ్, అశ్విన్ లు మాత్రం కడుపుబ్బ నవ్విస్తారని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News