: నిన్ను ‘మేక’ అని ఎందుకు పిలుస్తారు?.. రోజర్ ఫెదరర్‌ను షాక్‌కు గురిచేసిన చిన్నారి.. నవ్వుతూ సమాధానం ఇచ్చిన టెన్సిస్ దిగ్గజం!
19 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించి చరిత్రకెక్కిన స్విస్ టెన్నిస్ దిగ్గజం, ప్రపంచ నెంబర్ 3 ఆటగాడు రోజర్ ఫెదరర్‌కు ఓ చిన్నారని నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. ఓ కార్యక్రమంలో చిన్నారులతో ముచ్చటించిన ఫెదరర్ ఊహించని ప్రశ్నతో అవాక్కైనా, తర్వాత చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు. ‘నేను మిమ్మల్ని ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నాను’.. అంటూ మొదలుపెట్టిన ఓ చిన్నారి.. స్విట్జర్లాండ్ చాలా కూల్‌గా ఉంటుంది? నిజమేనా? అంటూ ప్రశ్నించాడు. అనంతరం అక్కడ చాలా జంతువులు ఉండగా మిమ్మల్ని అభిమానులు ‘మేక’ అని ఎందుకు పిలుస్తారు? అని పశ్నించాడు. అతడి ప్రశ్నతో ఫెదరర్ సహా అక్కడున్న అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. అయితే ఆ వెంటనే ఫెదరర్ తేరుకుని చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు. కొందరు అభిమానులు నన్ను అలా పిలుస్తుంటారు. అయితే నన్ను నేను మాత్రం అలా పిలుచుకోను అంటూ బదులిచ్చాడు. అయినా మేకలు కూడా జంతువుల్లో ఓ భాగమే కదా! అనడంతో అక్కడ నవ్వులు పూశాయి.