: గుండు చేయించుకోవడం వల్ల ఉపయోగం ఉందంటే నేను రెడీ.. ‘ఎంఎస్ ధోనీ..’ ఫేం నటి దిశా పఠానీ
తాను గుండు చేయించుకోవడం వల్ల పాత్రకు ఉపయోగపడుతుందంటే అందుకు తాను సిద్ధమేనని బాలీవుడ్ నటి దిశా పఠానీ పేర్కొంది. స్క్రిప్టు ప్రకారం తాను నడుచుకుంటానని, గుండు చేయించుకోవడం వల్ల కథకు పూర్తి న్యాయం చేసినట్టు అవుతుందని బలంగా నమ్మితే ముందుకే వెళ్తానని చెప్పిందీ అమ్మడు. ‘ఎంఎస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ’తో వెలుగులోకి వచ్చిన ఈ సుందరి అందరూ చెబుతున్నట్టుగానే ‘కథ డిమాండ్ చేస్తే’ అనడం మొదలుపెట్టింది.
హీరోయిన్లు జత్తుతో ఎందుకు ప్రయోగాలు చేయకూడదని ప్రశ్నించిన దిశా తాను మాత్రం అవసరం అనుకుంటే గుండు గీయించుకోవడానికైనా సిద్ధమేనని స్పష్టం చేసింది. అయితే దానివల్ల సినిమాకు ఎంత మేలు జరుగుతుందని ముందు ఆలోచిస్తానని పేర్కొంది. అయితే ఇప్పటి వరకు అటువంటి ప్రయోగాలు చేసే అవకాశం ఎవరికీ రాలేదని పేర్కొంది. గార్నియర్ కలర్ నేచురల్స్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న దిశా పఠానీ.. తన జుత్తు మొత్తం వివిధ రకాల రసాయనాలతో నిండిపోయిందని తెలిపింది. కాబట్టి దానిని రోజువారీ సంరక్షించుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.