: 31న రాష్ట్రపతి అపాయింట్ మెంట్ కోరిన డీఎంకే..అవిశ్వాస తీర్మానం కోసమే!
తమిళనాట మరోసారి రాజకీయ అనిశ్చితికి తెరలేచింది. 22 మంది తన ఎమ్మెల్యేలతో దినకరన్ తెరవెనుక మంత్రాంగం జరుపుతుండడం.. మరోపక్క శశికళ, దినకరన్ లను అన్నాడీఎంకే నుంచి బహిష్కరించడం.. ఈ నేపథ్యంలో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవాలని పళనిస్వామి ప్రభుత్వాన్ని డీఎంకే డిమాండ్ చేస్తోంది.
ఈ నేపథ్యంలో ఈ నెల 31న రాష్ట్రపతి అపాయింట్ మెంట్ కావాలని డీఎంకే రాష్ట్రపతి కార్యాలయాన్ని సంప్రదించింది. పళనిస్వామి ప్రభుత్వానికి అసెంబ్లీలో తగిన బలం లేదని, బలనిరూపణకు ఆదేశాలు జారీ చేయాలని డీఎంకే శాసనసభాపక్ష నేత స్టాలిన్ రాష్ట్రపతిని కోరనున్నారు. దీంతో తమిళనాడు రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి.