: గుర్మీత్ బాబా మనిషి కాదు.. అడవి మృగం.. అతనిపై దయ చూపించాల్సిన అవసరం లేదు!: న్యాయమూర్తి వ్యాఖ్యలు
డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్‌పై సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జగ్దీప్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అతడు మనిషి కాదని, అడవి మృగమని పేర్కొన్న జడ్జి.. గుర్మీత్‌పై జాలి చూపించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. బాధిత మహిళలు ఇద్దరూ అతడిని దేవుడిలా భావించారని పేర్కొన్నారు.
అయితే గుర్మీత్ మాత్రం తన సహజసిద్ధ స్వభావంతో తనను గుడ్డిగా అనుసరిస్తున్న మహిళలపై అత్యాచారాలకు తెగబడ్డాడని పేర్కొన్నారు. తాను ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టానని, తనపై జాలి చూపాలన్న గుర్మీత్ వ్యాఖ్యలపై స్పందిస్తూ జడ్జి ఈ వ్యాఖ్యలు చేశారు. అతడిపై జాలి, దయ చూపిస్తే న్యాయవ్యవస్థకు, ప్రజా విశ్వాసానికి అంతకుమించిన హాని ఇంకొకటి ఉండదని న్యాయమూర్తి జగ్దీప్ సింగ్ తేల్చి చెప్పారు.