: నంద్యాల టెన్షన్ అయిపోయింది.. ఇక కాకినాడ.. మరో గంటలో పోలింగ్ ప్రారంభం!
సోమవారం వరకు నంద్యాల టెన్షన్‌తో సరిపోయింది. ఇప్పుడు కాకినాడపై ఉత్కంఠ మొదలైంది. నేటి ఉదయం 7 గంటలకు కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. మూడు రోజుల అనంతరం సెప్టెంబరు 1న ఫలితాలు వెల్లడికానున్నాయి.
ఈ ఎన్నికల్లో మొత్తం 48 డివిజన్లకు గాను టీడీపీ 39, మిత్రపక్షం బీజేపీ 9 డివిజన్లలో పోటీ చేస్తున్నాయి. ప్రధాన ప్రత్యర్థి వైసీపీ మొత్తం స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. కాంగ్రెస్ 17 డివిజన్లలో పోటీలో ఉంది. ఇండిపెండెంట్లు ఆరు డివిజన్లలో పోటీలో ఉన్నారు. నిజానికి 50 డివిజన్లలో పోటీ జరగాల్సి ఉంది. అయితే కాకినాడ రూరల్ మండలంలోని గంగానపల్లి, ఎస్.అచ్యుతాపురం, స్వామినగర్ ప్రాంతాల్లోని రెండు డివిజన్లలో ఎన్నికను హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది.