: విమానంలో ఎలుక ... 200 మంది ప్రయాణికులకు 9 గంటల పాటు ఇబ్బంది!


ప్రపంచంలోనే అత్యధిక దూరం ప్రయాణించే ఢిల్లీ-శాన్‌ఫ్రాన్సిస్కో ఎయిర్‌ ఇండియా-173 విమానం 200 మంది ప్రయాణికులతో బయల్దేరాల్సి ఉండగా 9 గంటల ఆలస్యంగా బయల్దేరిన ఘటన ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌ పోర్టులో చోటుచేసుకుంది. ఎయిరిండియా విమానం టేకాఫ్ కు సిద్ధంగా ఉన్న సమయంలో విమాన సిబ్బందికి అందులో ఓ ఎలుక కనిపించింది.

దీంతో అప్రమత్తమైన అధికారులు విమానాన్ని ఆపి, ప్రయాణికులను దించి, ఎలుక కోసం వెతుకులాట ప్రారంభించారు. సుమారు ఆరుగంటల గాలింపు తరువాత ఎలుకను పట్టుకున్నారు. ఇంతలో విమాన సిబ్బంది షెడ్యూల్ టైమ్ పూర్తి కావడంతో నిబంధనల ప్రకారం వారి తరువాతి డ్యూటీ సిబ్బంది వచ్చేవరకు విమానం ప్రయాణికులతో ఎదురు చూసింది. ఇది మరో మూడు గంటలసేపు కొనసాగింది. దీంతో మొత్తం 9 గంటలసేపు 200 మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందినెదుర్కొన్నారు. ఎట్టకేలకు 9 గంటల విరామం ముగిసిన తరువాత విమానం శాన్ ఫ్రాన్సిస్కో బయల్దేరింది. 

  • Loading...

More Telugu News