: రేపటి అర్జున అవార్డుల ప్రదానోత్సవ వేడుకకి నేను రాలేను: పుజారా ప్రకటన
భారత క్రికెటర్ చటేశ్వర పుజారా రేపు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకోవాల్సి ఉంది. అయితే, పుజారా రేపు జరిగే ఆ వేడుకకు హాజరు కావడం లేదని ప్రకటించాడు. ఆ అవార్డుకి ఎంపికవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పిన పుజారా.. ప్రస్తుతం తాను ఇంగ్లాండ్‌లో ఒక జట్టు తరఫున కౌంటీల్లో ఆడుతున్నట్లు పేర్కొన్నాడు. తన నిబద్ధతే తనకు గుర్తింపు తెచ్చిందని అన్నాడు. తనకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగించుకుంటూ క్రికెట్ ఆడేందుకే ప్రాధాన్యత ఇస్తానని చెప్పాడు. కాగా, రేపు ఈ అవార్డుకు ఎంపికైన ఇతర క్రీడాకారులు ఈ వేడుకకు హాజరై అవార్డులను స్వీకరిస్తారు.