: డ్రగ్స్ కేసు విచారణ సమయంలో బాలయ్య నాకు చాలా సపోర్టు ఇచ్చారు: పూరీ జగన్నాథ్


హైదరాబాదును పట్టి కుదిపేసిన డ్రగ్స్‌ వ్యవహారం కేసులో తనను విచారించినప్పుడు ప్రముఖ నటుడు బాలకృష్ణ తనకు చాలా సపోర్ట్‌ చేశారని దర్శకుడు పూరీ జగన్నాథ్ తెలిపారు. పైసా వసూల్ సినిమా ప్రమోషన్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డ్రగ్స్ వ్యవహారం సమయంలో నా కుటుంబానికి అండగా నిలిచిన ఒకేఒక్క నటుడు బాలయ్య అన్నారు. తెల్లవారు జాము 4 గంటలకే ఆయన నిద్రలేచి, షూటింగ్ స్పాట్ కు వచ్చేవారని, సినిమాలు, సంగీతం, ఇంకా చాలా విషయాలపై అభిప్రాయాలు పంచుకునేవారమని అన్నాడు. ఇప్పటి యంగ్ హీరోల కంటే పది రెట్లు ఎనర్జీ బాలయ్యలో ఉందని ఆయన చెప్పారు. బాలయ్యతో కలిసి పనిచేయడం ఆనందం కలిగించిందని పూరీ చెప్పాడు. కాగా, భవ్య క్రియేషన్స్‌ పతాకంపై నిర్మితమైన ‘పైసా వసూల్‌’ లో శ్రియ, ముస్కాన్‌, కైరాదత్‌, బాలయ్య సరసన నటించగా, ఈ సినిమాకు సంగీతం అనూప్‌ రూబెన్స్‌ అందించాడు. 

  • Loading...

More Telugu News