: శిక్షను హైకోర్టులో సవాల్ చేస్తాం: రాక్ స్టార్ బాబా న్యాయవాదులు


అత్యాచారం కేసులో పదేళ్ల శిక్షకు గురైన గుర్మీత్ రాం రహీం సింగ్ బాబాకు సీబీఐ రోహ్ తక్ ప్రత్యేక కోర్టు విధించిన తీర్పును హైకోర్టులో సవాలు చేయనున్నామని ఆయన తరపు న్యాయవాదులు తెలిపారు. అయితే దీనిపై తీర్పు పూర్తి పాఠం చదివిన తరువాత పూర్తి స్థాయిలో స్పందిస్తామని అన్నారు. ఈ కేసులో సీబీఐ సమగ్ర దర్యాప్తు చేయలేదని, సరైన సాక్ష్యాలు కూడా లేవని వారు తెలిపారు. అంతే కాకుండా బాబా సామాజిక సేవను కూడా న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోలేదని వారు తెలిపారు. ఈ నేపథ్యంలో హైకోర్టు బాబాకు న్యాయం చేస్తుందని తాము విశ్వసిస్తున్నామని తెలిపారు. ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని వారు తెలిపారు. 

  • Loading...

More Telugu News