: హైదరాబాద్లో విజృంభిస్తోన్న డెంగ్యూ
హైదరాబాద్లో డెంగ్యూ విజృంభిస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. విష జ్వరాలు, డెంగ్యూతో హైదరాబాద్లోని ఫీవర్ ఆసుపత్రితో పాటు పలు ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరిగిపోతోందని చెప్పారు. పగటి పూట కుట్టే ఏడిస్ దోమ వల్ల డెంగ్యూ వస్తుందని తెలిపారు. కాచి చల్లార్చిన నీళ్లను తాగాలని, జ్వరంతో బాధపడుతోంటే వైద్యుడిని సంప్రదించి రక్తపరీక్ష చేయించుకోవాలని చెబుతున్నారు. డెంగ్యూకి చికిత్స లేదని, డెంగ్యూతో బాధపడుతున్న వారికి జ్వరం తగ్గేలా చికిత్స మాత్రం చేస్తారని వివరించారు. ఈ చికిత్స తీసుకుంటే సాధారణంగా డెంగ్యూ మూడు రోజుల్లో తగ్గిపోతుందని, జ్వరం మాత్రం వారం రోజుల పాటు ఉంటుందని చెప్పారు.