: నంద్యాల ప్రజలు రోజాకు గుండు కొట్టారు!: అకట్టుకుంటున్న స్లోగన్లు.. పోస్టర్లు
నంద్యాల ఉప ఎన్నికల్లో విజయం సాధించడంతో టీడీపీ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబును దుర్భాషలాడిన రోజాను విమర్శిస్తూ నంద్యాలలో పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఈ పోస్టర్లు టీడీపీ కార్యకర్తలను ఆకట్టుకుంటున్నాయి. 'టీడీపీ దెబ్బ రోజా అబ్బా' అంటూ స్లోగన్ లను కూడా పోస్టర్లపై ముద్రించారు. అలాగే ఈ పోస్టర్లలో రోజాబొమ్మకు గుండు చేశారు. అలాగే, నంద్యాల ప్రజలు రోజాకు గుండు కొట్టారంటూ పేర్కొన్నారు. ఈ పోస్టర్లు ఇప్పుడు నంద్యాలలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాయి.