: గుర్మీత్ బాబాకు జీవిత ఖైదు కరెక్టు... మద్దతుదారులతో విధ్వంసం సృష్టించి, భయపెట్టే ప్రయత్నం చేశారు: నెటిజన్ల ఆగ్రహం
రాక్ స్టార్ బాబాగా నిన్నటి వరకు కీర్తనలు, భజనలు విన్న రాం రహీమ్ గుర్మీత్ బాబాకు జైలు శిక్ష ఖరారు కావడంతో ఆయన మద్దతుదారులు విధ్వంసానికి దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గుర్మీత్ బాబాతో పాటు, ఆయన మద్దతుదారులపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు జీవిత ఖైదు వేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. బాబా పేరుతో గుర్మీత్ చేసిన ఘోరాలు ఒకఎత్తైతే, ఆయన అనుచరులు చేసిన విధ్వంసం మరొక ఎత్తని వారు చెబుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల ఆస్తులను ధ్వంసం చేసి, తీవ్ర ఆస్తి నష్టానికి పాల్పడడంతో పాటు ప్రజలను భయభ్రాంతులను చేశారని, ఇలాంటి వ్యక్తులకు కఠినమైన శిక్షలు విధించాల్సిందేనని వారు డిమాండ్ చేశారు.