: హాజరు శాతం అంచనా వేయడానికి విద్యార్థులకు స్మార్ట్ కార్డులు.... తమిళనాడు ప్రభుత్వం యోచన
పాఠశాలకు హాజరవుతున్న విద్యార్థుల హాజరు శాతం అంచనా వేయడానికి త్వరలో వారికి స్మార్ట్ కార్డులు జారీ చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కేఏ సెంగొట్టియాన్ స్పష్టం చేశారు. ఈరోడ్‌లోని ఓ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ స్మార్ట్ కార్డుల వల్ల తల్లిదండ్రులకు కూడా ఉపయోగం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోదీ డిజిటలైజేషన్ ఆశయంలో భాగంగా స్కూళ్లలో అన్ని వ్యవహారాలను, ఫీజు చెల్లింపులను ఆన్‌లైన్ ద్వారానే కొనసాగేలా చూడాలని సీబీఎస్ఈ ఆదేశించింది. ఇందులో భాగంగా ఇటీవల మైసూర్‌లోని హాల్ కేసారే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల హాజరును అంచనా వేసేందుకు మొబైల్ యాప్ చేయించిన సంగతి తెలిసిందే.