: గుర్మీత్ బాబాకు శిక్ష ఖరారు నేపథ్యంలో.. హర్యానాలో మరోసారి విధ్వంసం ప్రారంభం
అత్యాచారం కేసులో దోషిగా తేలిన డేరా సచ్చా సౌధా చీఫ్, రాక్‌స్టార్ బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కి రోహ్‌తక్ జైలులో సీబీఐ న్యాయస్థానం శిక్షను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హర్యానాలో మరోసారి అల్లర్లు చెలరేగుతున్నాయి. సిర్సాలో ఆందోళనకారులు పలు వాహనాలకు నిప్పంటించారు. పుల్కా ప్రాంతంలో రెండు కార్లను తగులబెట్టారు. పంజాబ్, హర్యానాల్లో అన్ని రహదారులపై కేంద్ర బలగాలతో పాటు ఆయా రాష్ట్రాల పోలీసులు మోహరించారు. రోహ్‌తక్ జైలు వద్ద కూడా భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. పంజాబ్‌లో శాంతి భద్రతలపై ఆ రాష్ట్ర సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. భక్తులు ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడవద్దని , శాంతితో ఉండాలని డేరా సచ్చా సౌధా ఛైర్‌పర్సన్ విపాసనా ఇన్సాన్ విజ్ఞప్తి చేశారు.