: గుర్మీత్ బాబాకు పదేళ్ల జైలు శిక్ష ఖరారు.. తీర్పును వెల్లడించిన సీబీఐ న్యాయస్థానం !
అత్యాచారం కేసులో దోషిగా తేలిన సచ్చా సౌధా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కి సీబీఐ న్యాయస్థానం ఈ రోజు శిక్షను ఖరారు చేసింది. గుర్మీత్ సింగ్ కి కఠినమైన శిక్ష విధించాలని సీబీఐ తరఫు న్యాయవాది వాదించిన నేపథ్యంలో కోర్టు ఆయనకు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ శిక్షను న్యాయమూర్తి జగ్ దీప్ సింగ్... రోహ్ తక్ జైలులో ఏర్పాటు చేసిన కోర్టులో ప్రకటించారు.