: అమెరిక‌న్ టీవీ తెర మీద‌కి మ‌రో భార‌త న‌టి!


త్వ‌ర‌లో అమెరిక‌న్ టీవీ తెర మీద మ‌రో భార‌త న‌టి క‌నువిందు చేయ‌నుంది. అక్క‌డ బాగా ప్రాచుర్యం పొందిన `లెథ‌ల్ వెప‌న్‌` టీవీ షోలో బాలీవుడ్ న‌టి పూజా బాత్రా న‌టించనుంది. ఇప్ప‌టికే ఆమె పాత్ర షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఈ విష‌యాన్ని ఆమె ట్విట్ట‌ర్ ద్వారా అభిమానుల‌కు తెలియ‌జేశారు. టీవీ షోలో న‌టించే ప్ర‌ముఖ హాలీవుడ్ న‌టులతో దిగిన ఫొటోను ఆమె షేర్ చేశారు. హిందీలో విరాస‌త్‌, చంద్ర‌లేఖ‌, హ‌సీనా మాన్ జాయేగీ, క‌హీ ప్యార్ న హోజాయే వంటి హిట్ చిత్రాల్లో న‌టించింది. అలాగే తెలుగులో `సిసింద్రీ` సినిమాలో ఒక పాట‌లో నాగార్జున స‌ర‌స‌న ఆమె న‌ర్తించింది. దాస‌రి అరుణ్‌కుమార్ న‌టించిన `గ్రీకువీరుడు` చిత్రంలో హీరోయిన్‌గా న‌టించింది.

  • Loading...

More Telugu News