: గుర్మీత్ బాబా అత్యాచారం కేసులో ముగిసిన వాదనలు.. కఠిన శిక్ష వేయాలన్న సీబీఐ తరఫు న్యాయవాది
అత్యాచారం కేసులో దోషిగా తేలిన సచ్చా సౌధా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కి కాసేపట్లో సీబీఐ న్యాయస్థానం శిక్షను ఖరారు చేయనుంది. ఈ నేపథ్యంలో మరోసారి ఏం జరుగుతుందోనన్న ఆందోళన సర్వత్రా నెలకొంది. పంజాబ్, హర్యానాలతో పాటు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలో కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. తనను తాను దేవుడిగా ప్రకటించుకున్న గుర్మీత్ సింగ్ ఇద్దరు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడిన విషయం రుజువైన నేపథ్యంలో ఆయనకు కఠిన శిక్ష విధించాలని సీబీఐ తరఫు న్యాయవాది కోరారు.